భారత్: పట్టాలెక్కుతున్న వందేభారత్ స్లీపర్

- August 27, 2024 , by Maagulf
భారత్: పట్టాలెక్కుతున్న వందేభారత్ స్లీపర్

భారతీయ రైల్వే అత్యాధునిక రైళ్లయిన వందేభారత్ పై ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉన్న ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్ ను ప్రవేశపెట్టారు.

టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదు మినహా అన్ని సౌకర్యాలతో ప్రయాణికులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వీటిల్లో కూర్చొని ప్రయాణం చేయడానికి మాత్రమ సౌకర్యం ఉంది. దీంతో త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలసిందే. వీటికి సంబంధించిన పనులు చెన్నైలోని రైల్వే ఇంటిగ్రెట్ కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి.

గుజరాత్ లో వందే మెట్రో
వందేభారత్ తోపాటు దేశవ్యాప్తంగా వందే మెట్రో నడిపించాలని నిర్ణయిం తీసుకున్నారు. తొలి వందే మెట్రో గుజరాత్ లో నడుస్తోంది. దశలవారీగా దీన్ని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. చెన్నై ఐసీఎఫ్ లో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) బెంగళూరు ప్లాంట్ లోకోచ్ లను తయారు చేస్తోంది. సెప్టెంబరు 20వ తేదీకి ఇవి చెన్నైకి చేరుకుంటాయి. తర్వాత అన్నిరకాల పరీక్షలు జరపడానికి 20 రోజుల సమయం పడుతుంది. ఇది గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. అన్నిరకాల పరీక్షలతోపాటు ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత ఈ ఏడాదే ఇవి పట్టాలెక్కబోతున్నాయి.

ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా
యూరోపియన్ దేశాల్లో ప్రయాణించే రైళ్లల్లో ఉండ ప్రపంచస్థాయి ప్రమాణాలను భారతీయ రైల్వే అందించబోతోంది. రాత్రివేళ లైట్లు ఆపేసినప్పుడు వాష్ రూమ్ కు వెళ్లాలంటే వారికి కింద LED స్ట్రిప్స్ ఉంటాయి. ఈ రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే సహాయకులు ఉంటారు. వారికి కూడా ప్రత్యేక బెర్త్ లను ఏర్పాటు చేస్తారు. మొత్తం 6 కోచ్ లతో ఉండే వందేభారత్ స్లీపర్ లో 823 బెర్త్ లు ఉంటాయి. థర్డ్ ఏసీ కోచ్ లు 11, సెకండ్ ఏసీ కోచల్ 4, మొదటి ఏసీ ఒక కోచ్ ఉంటాయి. మొత్తం మీద 823 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ లిమిటెడ్, యూరోపియన్ రైలు కన్సల్టెంట్ సంయుక్తంగా సేవలందిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com