దుబాయ్ నైట్‌క్లబ్ స్కామ్..భారీ బిల్లులతో టోకరా..!

- August 27, 2024 , by Maagulf
దుబాయ్ నైట్‌క్లబ్ స్కామ్..భారీ బిల్లులతో టోకరా..!

యూఏఈ: నకిలీ టిండెర్ ప్రొఫైల్‌లు, మధ్యవర్తులు మరియు నైట్‌క్లబ్‌లతో కూడిన ఒక రాకెట్ గుట్టును అధికారులు రట్టు చేశారు. ప్రతి రాత్రి వేల దిర్హామ్‌లను వసూలు చేస్తు పలువురిని మోసం చేస్తున్నారు.నకిలీ ప్రొఫైల్‌లు కలిగిన మహిళలు టిండెర్, బంబుల్ మరియు ఇతర డేటింగ్ యాప్‌లలో పురుషులతో చాటింగ్ ప్రారంభిస్తారు. వారు వారిన నిర్దిష్ట నైట్‌క్లబ్‌లకు ఆహ్వానిస్తారు. ఖరీదైన పానీయాలను ఆర్డర్ చేస్తారు. ఆపై అదృశ్యమవుతారు. Dh10,000 వరకు బిల్లులు రావడంతో పలువురు మోసానికి గురవుతున్నారు. స్కామర్లు వాట్సాప్‌లో వారి టార్గెట్‌లను బ్లాక్ చేసి, వారి సోషల్ మీడియా ప్రొఫైల్‌లను తొలగిస్తారు.మొత్తం బిల్లును పెంచడానికి అదనపు ఉత్పత్తులు లేదా సేవలను ప్రోత్సహించే విక్రయ వ్యూహమని విచారణలో గుర్తించారు. భారీ లాభాల కోసం కస్టమర్ల నమ్మకాన్ని దోపిడీ చేస్తూ అనైతిక వ్యాపారానికి తెరతీసినట్లు అధికారులు తెలిపారు."ఈ స్కామ్ యూరప్,  ఫార్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో అధికంగా ఉంది, కానీ ఇప్పుడు దుబాయ్‌లోకి ప్రవేశిస్తోంది." అని ఒక హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ చెప్పారు.
బిజినెస్ బేలోని నైట్‌క్లబ్‌లో ఒక మహిళ విస్కీని నీళ్లలా తాగిందని, అనంతరం అక్కడి నుంచి పారిపోయిందని ఓ వ్యక్తి తెలిపాడు. అందులో ఆల్కహాల్ ఉందా? అన్న అనుమానం వచ్చిందన్నారు. Dh10,177, దాదాపు 2,500 యూరోల బిల్లును చెల్లించినట్లు తెలిపారు. "మేము రాత్రి 9.30 మరియు ఉదయం 12 గంటల మధ్య అక్కడ ఉన్నాము" అని అతను చెప్పాడు. ఇంత తక్కువ సమయంలో అంతటి బిల్లు రావడం తనను ఆశ్యర్యానికి గురిచేసిందన్నారు. ఇందులో పెద్ద మోసం ఉందని తనకు అనిపించిందన్నారు.  ఆన్‌లైన్ ఫోరమ్‌లు ఇలాంటి ఫిర్యాదులతో నిండిపోయాయి. అయితే, దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com