తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు..ఈనెల 29న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహణ..!

- August 27, 2024 , by Maagulf
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు..ఈనెల 29న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహణ..!

టీటీడీలో జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు ఒక ప్రకటనని కూడా విడుదల చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో, డిస్పెన్సరీస్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఐదు పోస్టులు ఉన్నట్లు టీటీడీ చెప్పింది. (BC-B(W) -01, ST (W) - 01, BC-B -01, SC -01, BC-D(W)- 01) పోస్టులు భర్తీకి సంబంధించి MBBS విద్యా అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 29న వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.

టీటీడీ భవనం ప్రాంగణంలో సెంట్రల్ హాస్పిటల్ లో ఆగస్టు 29వ తేదీన ఉదయం 11 గంటలకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. విద్యార్హతలు అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలతో పాటుగా జిరాక్స్ కాపీలను కూడా ఇంటర్వ్యూకి తీసుకువెళ్లాలి. ఇతర వివరాలకు మీరు https://www.tirumala.org/ వెబ్ సైట్ లో చూడవచ్చు. కార్యాలయం పని వేళల్లో 0877-2264371 నెంబర్ కి సంప్రదించవచ్చని టీటీడీ చెప్పింది.

కాబట్టి ఎంబిబిఎస్ పూర్తి చేసిన వాళ్లు ఆసక్తి ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. TTD ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రిలో డిస్పెన్సరీలో ఒక సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆగస్టు 29న ఈమేరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ భవనం ప్రాంగణంలో ఉన్న సెంట్రల్ హాస్పిటల్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com