ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు: మంత్రి పొన్నం ప్రభాకర్

- August 27, 2024 , by Maagulf
ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు: మంత్రి పొన్నం ప్రభాకర్

ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ లో నిర్వహణ జరుగుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

కాగా.. వినాయకచవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలూ జోరందుకున్నాయి. ఈనేపథ్యంలో.. గణేష్ ఉత్సవాలు ఏర్పాట్ల పై ఏంసిఆర్ హెచ్ ఆర్ డిలో మంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు మనం జరుపుకుంటామన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ఏర్పాట్లు చేస్తాయన్నారు. ఇందుకు ప్రజల సహకారం కూడా చాలా అవసరమని తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్లు అన్ని రకాల సర్వే లు నిర్వహించారన్నారు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మొదటి గణేష్ పండుగ అని తెలిపారు. అందరి సహకారంతో ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తామన్నారు.

ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవ ప్రిపరేషన్ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణ లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులకు ఎన్నో ఏళ్ల అనుభవం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కి సంభందిచిన ఈ గణేష్ ఉత్సవాలకు మీ సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. పెద్దలు ఇచ్చే సూచనలు తీసుకుని గణేష్ ఉత్సవాలు జరిపించాలని అధికారులను కోరుతున్నామని తెలిపారు.

హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లపై సమీక్ష ప్రారంభించామన్నారు. గణేష్ ఉత్సవాల బందోబస్తు ముంబై తో సమానంగానే ఉన్నామన్నారు. గత సంవత్సరం కూడా 50 వేలకు పైగానే విగ్రహాలు వెలిశాయన్నారు. గణేష్ ఉత్సవ బందోబస్తు చాలా పెద్దదే అని, GHMC, ఇతర వ్యవస్థలతో కో ఆర్డినేట్ చేసుకుని పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. నిమర్జనం సమయంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. క్రేన్ల ఏర్పాటు కూడా డిఫెక్ట్ లేని వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నారు. క్రేన్ కి ఆల్టర్నేట్ డెవర్లను కూడా అందుబాటులో ఉండేలా చూసుకుంటే.. ఆలస్యం జరగకుండా నిమర్జనం జరుగుతుందని సీపీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com