ఏపీ ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్
- August 27, 2024
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని చెప్పారు. వైసీపీకి ప్రజలు 11 సీట్లే ఇచ్చినా ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ దక్కిందని, కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై తాను మాట్లాడనని తెలిపారు. సెప్టెంబర్1 నుంచి రెవెన్యూ సదస్సులు పెడుతున్నామని, ఏపీలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు.
చంద్రబాబు సీఎం అవ్వటంతో ఢిల్లీతో పాటు జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ పెరుగుతోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఏపీలో ఏడు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురం లలో వీటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
మొట్టమొదటి సీ ప్లేన్ డెమోను అక్టోబరులో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని చెప్పారు. విమానాశ్రయానికి వేల ఎకరాల్లో భూమి అవసరం ఉంటుందని, ఈ సమస్యకు పరిష్కారంగా సీ ప్లేన్ విధానం ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలకు సంబంధించి విమానయాన శాఖలో విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు