కెనడాలో ఇండియన్స్ కు కొత్త భయం....
- August 28, 2024
కెనడా: కెనడాకు వలస వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలను అక్కడి ప్రభుత్వం చేస్తోంది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటున్నట్లు ప్రధాన జస్టిస్ ట్రూడో మరోసారి పేర్కొనడం ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది.ఈ నిర్ణయం 70,000 మంది విదేశీ విద్యార్థుల పై ప్రభావం చూపుతోందని అంచనా వేస్తున్నారు.దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ తో పాటు, అంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాలో నిరసన ర్యాలీలు చేపడుతున్నారు.
విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్న కెనడా....అందుకోసం అనేక మార్గాలను చేపడుతోంది. ఇటీవల హాలిఫ్యాక్స్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ట్రూడో ప్రభుత్వం చర్చలు చేపట్టింది. ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మూడు మార్పులు చేశారు. అవి సెప్టెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనలు నిర్మాణ, ఆరోగ్య, ఆహార భద్రత రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఉంటుందని ప్రధాని ట్రూడో పేర్కొన్నారు. ఉపాధి కోసం చూస్తున్న కెనడియన్లతో పాటు విదేశీ తాత్కాలిక కార్మికుల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వేతన విదేశీ కార్మికులపై ఆధారపడటం అంటే శిక్షణ, సాంకేతికతలపై కెనడా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా శాశ్వత నివాసితుల అనుమతుల్లోనూ గణనీయ మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నట్లు చెప్పారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







