అర్చకులకు సీఎం చంద్రబాబు శుభవార్త..!

- August 28, 2024 , by Maagulf
అర్చకులకు సీఎం చంద్రబాబు శుభవార్త..!

అమరావతి: అర్చకులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అర్చకుల వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వారి వేతనాన్ని రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.10వేల పెంచాలన్నారు చంద్రబాబు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3వేలు భృతి ఇవ్వాలన్నారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ.25వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ మంత్రి, అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

బలవంతపు మత మార్పిడులు ఆగాలి, ఆలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదు- సీఎం చంద్రబాబు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి. అపచారాలకు చోటు ఉండకూడదు. బలవంతపు మత మార్పిడులు ఆగాలి. అన్యమతస్థులు రాకూడదు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. టెంపుల్ టూరిజం (ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి) ప్రమోషన్ కోసం మూడు శాఖల మంత్రులతో(దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ) కమిటీ. దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం. అర్చకుల వేతనం రూ.10వేల నుంచి రూ. 15వేలకు పెంపు.

ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేలు భృతి. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలి” అని దేవాదాయ శాఖపై సమీక్షలో అధికారులతో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com