CISF/BSF లకు కొత్త చీఫ్‌ల నియామకం
- August 28, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కీలక భద్రతా సంస్థలైన సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లకు కేంద్రం కొత్త చీఫ్‌లను నియమించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా రాజ్విందర్ సింగ్భట్టి నియమితులయ్యారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రాజ్విందర్ సింగ్.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
అలాగే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా దల్జిత్ సింగ్ చౌధరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్బీ డీజీగా కొనసాగుతున్నారు. బీఎస్ఎఫ్ చీఫ్‌గా ఆయన వచ్చే ఏడాది నవంబర్ 30వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతారని కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







