ఒమన్‌లో కేరళ వ్యక్తి హత్య: ఆరుగురి అరెస్ట్‌

- June 18, 2016 , by Maagulf
ఒమన్‌లో కేరళ వ్యక్తి హత్య: ఆరుగురి అరెస్ట్‌


ఓ దొంగతనాన్ని ఎదుర్కొనే క్రమంలో కేరళకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జాన్‌ ఫిలిప్‌ అనే ఫ్యూయల్‌ స్టేషన్‌ ఎంప్లాయీని మృతుడిగా రాయల్‌ ఒమన్‌ పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి దుండగులు 4000 నుంచి 5000 ఒమన్‌ రియాల్స్‌ దోచుకున్నట్లుగా వివరించిన పోలీసులు, కేసు విచారణ జరుగుతోందని చెప్పారు. సిసిటివి కెమెరాల్ని దుండగులు ధ్వంసం చేశారు. ఫిలిప్‌ 13 ఏళ్ళుగా ఒమన్‌లో పనిచేస్తన్నాడు. ఆయనకు భార్య బిను, ఇద్దరు చిన్నారుల ఉన్నారు. ఫిలిప్‌ బంధువులు కేరళ ప్రభుత్వాన్ని, అలాగే భారత ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాల్ని తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తుల్ని రాయల్‌ ఒమన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com