కువైట్ లో ట్రాఫిక్ సమస్య.. పరిష్కారానికి సమన్వయ సమావేశం..!
- August 29, 2024
కువైట్: కువైట్ పాఠశాలలు పునర్ ప్రారంభం నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్ పెరగడం ప్రారంభించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జమాల్ అల్-ఫౌదరీ.. పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో ఒక ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. విద్య, కువైట్ మునిసిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్, సివిల్ సర్వీస్ బ్యూరో, ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్ట్‌మెంట్ కు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడానికి తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా వివిధ దశల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన పలు అమలులపై సమావేశంలో చర్చించారు. దీనిపై త్వరలోనే తుది నివేదిక ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







