ఐదు రోజుల పాటు పాస్ పోర్ట్ సేవలు బంద్‌

- August 29, 2024 , by Maagulf
ఐదు రోజుల పాటు పాస్ పోర్ట్ సేవలు బంద్‌

న్యూఢిల్లీ: పాస్ పోర్ట్ సేవా పోర్టల్ నిర్వహణ (మెయింటనెన్స్) సంబంధిత కార్యకలాపాల వల్ల పాస్ పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం వెల్లడించింది. పాస్ పోర్ట్ సేవలు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండవని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేయనున్నట్లు వివరించింది. రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. గురువారం (ఆగస్టు 29) రాత్రి 8 గంటల నుంచి ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్ అవుతాయని చెప్పారు.

సెప్టెంబర్ 2 వరకు కొత్త అపాయింట్ మెంట్లు బుక్ చేసుకోవడం వీలు కాదన్నారు. కొత్తగా పాస్ పోర్ట్ తీసుకోవడానికి, పాత పాస్ పోర్ట్ రెన్యూవల్ తదితర సేవలు పొందేందుకు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడానికి ఈ ఆన్ లైన్ సేవా పోర్టల్ ఉపయోగపడుతుంది. పాస్ పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ కారణంగా గంటల తరబడి ఎదురుచూసే పనిలేకుండా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అపాయింట్ మెంట్ బుక్ చేసుకుని నేరుగా ఆ సమయానికి వెళ్లవచ్చు. కాగా, సాంకేతిక నిర్వహణలో భాగంగా ఐదు రోజుల పాటు ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో పాస్ పోర్ట్ సేవలు పొందాలనుకునే వారికి కొంత అసౌకర్యం తప్పదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com