వచ్చే నెల 8న భారత్‌కు వెళ్లనున్న అబుధాబి క్రౌన్ ప్రిన్స్

- August 29, 2024 , by Maagulf
వచ్చే నెల 8న భారత్‌కు వెళ్లనున్న అబుధాబి క్రౌన్ ప్రిన్స్

అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ఖలీద్‌ బిన్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు.యూఏఈ తదుపరి నాయకత్వం కోసం నహ్యాన్‌ పోటీదారుగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా భారతదేశం యూఏఈ మధ్య వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది.

షేక్‌ ఖలీద్‌ సెప్టెంబర్‌ 8న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ పర్యటన పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.తన పర్యటనలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారని తెలుస్తోంది.ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్‌ సంబంధాలను మరింతగా పెంచుకోవడం పై దృష్టి సారించనున్నది.

‘భారత్‌, యూఏఈ మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి.ఈ పర్యటనలో ఆ పునాదిని మరింత బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దాల కోసం ఎదురుచూడడం, యూఏఈ భవిష్యత్‌ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం పై దృష్టి సారించనున్నట్లు-అబుధాబి అధికారి ఒకరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com