అట్లాంటాలో విజయవంతమైన వెనిగండ్ల రాము ఆత్మీయ అభినందన సభ
- August 29, 2024
అమెరికా: అట్లాంటా వాసి, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఐన వెనిగండ్ల రాము మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఫలితం కోసం రాష్ట్రం అంతా ఎంతో ఆతృతగా చూసిన గుడివాడ నియోజక వర్గం నుండి తెలుగుదేశం, జనసేన, భాజాపా కూటమి అభ్యర్థిగా నిలబడి అక్కడ ప్రజలు చరిత్ర ఎరుగని అఖండ తీర్పు తో సుమారు 53 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచి మొదట సారిగా అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటా విచ్చేసిన సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ,ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రవాస ఆంధ్రులు, కూటమి మద్దతు దారులు అశేష సంఖ్యలో కలిసి స్థానిక సంక్త్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో శ్రీనివాస్ నిమ్మగడ్డ ఆధ్వర్యం లో మన రాము సంబరాలు పేరిట ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసారు.
వందల కార్ల తో ర్యాలీగా రాము వెనిగండ్ల ని సమావేశ మందిరానికి తీసుకు రాగా, తెలుగింటి ఆడపడుచులు ఘన స్వాగతం పలకగా వారికీ తోడుగా కూటమి అభిమానులు డప్పు మేళాలతో సభా ప్రాంగణం అంతా అత్యంత కోలాహలంగా కలియ తిరిగారు.
తెలుగుదేశ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి,రాము వెనిగండ్ల వారి సుఖద వెనిగండ్ల, అట్లాంటా నాయకులు శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, మల్లిక్ మేదరమెట్ల, సతీష్ ముసునూరి, సురేష్ ధూళిపూడి వేదికను అలంకరించారు.
తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఎన్నారై అట్లాంటా టిడిపి నాయకులు శ్రీనివాస్ లావు, మల్లిక్ మేదరమెట్ల, సతీష్ ముసునూరి.ఎన్నారై అట్లాంటా జనసేన నాయకులు సురేష్ ధూళిపూడి, సురేష్ కరోతు మరియు భాజాపా అట్లాంటా నాయకులు కార్తికేయ బండారు విచ్చేసిన అతిథుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి సురేష్ పెద్ది మరియు సుజాత ఆలోకం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
గత నాలుగు పర్యాయాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని గుడివాడ వాసుల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని తన అనుభవాలని సభికులకు సుఖద వెనిగండ్ల వివరించి ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్ధికి మరీ ముఖ్యంగా గుడివాడ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఆత్మీయ సత్కార గ్రహీత గుడివాడ శాసనసభ్యులు శ్రీ రాము వెనిగండ్ల గారు మాట్లాడుతూ గుడివాడ పుట్టిన ప్రదేశం కాగా తన ఉన్నతికి ఎంతో కారణమైన అట్లాంటా కూడా తనకి పుట్టిన ఊరుతో సమానం అని మీ అందరి ప్రేమ అభిమానాలు వెలకట్టలేనివి అని చెప్పారు. తన పుట్టిన గుడివాడలో వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న కూడా ఇప్పుడు శాసన సభ్యుడిగా తనకి అవకాశం ఇచ్చిన తెలుగుదేశ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇతర కూటమి నాయకులకి ధన్యవాదములు తెలిపారు.తన గెలుపుకి అట్లాంటా మిత్రులు వెన్నుదన్నుగా నిలిచి ఎంతో వ్యయ ప్రయాసలతో గుడివాడ వరకు వచ్చి నైతిక మద్దతు తెలిపిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు,ఈ గెలుపు ద్వారానా తన బాధ్యత మరింత పెరిగింది అని ఇప్పటివరకు కనీస సౌకర్యాలకుకి కూడా గుడివాడ ప్రజలు నోచుకోలేదు అని ప్రజల అవసరాలని గాలికి వదిలేసి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చివేశారని అడిగితే బూతులతో సమాధానం , అణచురలతో దౌర్జన్యం చేయటంతో ప్రజలు విసిగి పోయి కూటమి అభ్యర్థి ఐన నన్ను గుడివాడ చరిత్ర లో భారీ మెజారిటీతో గెలిపించారని వారి రుణం ఈ జీవితం లో తీర్చుకోలేను అని..వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుడివాడ గడ్డ అభివృద్ధి అడ్డా గా మారుస్తా అని దానికి నా శక్తీ తో పాటు మీ సహకారం కూడా కావాలి అని సభికులని కోరారు. ఎప్పటి లాగ గుడివాడ ప్రజలతో పటు ఇక్కడ వారికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా అని ఎటువంటి కార్యక్రమాలు చెయ్యాలన్న, సహాయం కావాలి అన్నా మీ రాము ఎప్పుడు ఫోన్ లో అందుబాటులోనే వుంటా అని అందరం కలిసికట్టు మన మాతృభూమి అభివృద్ధి కి కృషి చెయ్యాలని కోరారు.
అట్లాంటా నాయకులు మాట్లాడతూ మనలో ఒకరు ఐన రాము గారు ...ప్రజా సేవకి ముందుకు రావటం , తెలుగుదేశ పార్టీ అవకాశం ఇవ్వటం అక్కడ ప్రజలు రాముని అత్యంత మెజారిటీ తో గెలిపించటం మన అట్లాంటా వాసులకి ఎంతో గర్వకారణంగా వుంది అని...రాము గెలిచాక ప్రపంచ నలుమూలల వున్నా పరిచయస్తులు, అభిమానులు ఫోన్ చేసి రాము అట్లాంటా వాసి అంట కదా అని ఎంక్వైరీ చేస్తుంటే ఆ అనుభూతి వర్ణించలేము అని తెలిపారు అలాగే రాముకి తమ సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయి అని..రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలుపంచుకుంటామని తెలిపారు.చివరిగా వ్యాఖ్యాతలు , సభికులు అడిగిన పలు ప్రశ్నలకి వెనిగండ్ల రాము దంపతులు ఎంతో విపులంగా ఎటువంటి అమరికలు లేకుండా సమాధానాలు చెప్పటం వచ్చిన అతిథుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ ఆత్మీయ సభని విజయవంతం చేయటానికి సహకరించిన మురళి బొడ్డు, అనిల్ యలమంచిలి, మధుకర్ యార్లగడ్డ,వినయ్ మద్దినేని , భరత్ మద్దినేని మరియు మిత్రులందరికీ సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!