ఐదుగురు మంత్రులతో నూతన మద్యం విధానం: ముఖేష్ కుమార్ మీనా
- August 29, 2024
విజయవాడ: ఏపీ రాష్ట్రంలో నూతన మద్యం విధానం రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘంను నియమిస్తూ ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేసారు. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవిలను నియమించారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని ఈ మంత్రివర్గ ఉప సంఘం సమీక్షించనుంది.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీలు వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను పరిశీలించనుంది. మద్యం విధాన రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి మంత్రి వర్గ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించనుందని మీనా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అత్యంత ఉత్తమమైన మద్యం పాలసీని తీసుకు రావాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







