మెగా వెర్సస్ అల్లు.! రచ్చకి అలా చెక్ పడేనా.?
- August 30, 2024
బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 న జరిగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడకకు హాజరు కానున్నారని సమాచారం. వీరిద్దరితో పాటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి కూడా ఈ వేడుకకు ఆహ్వానం అందింది.
ఈ మధ్య మెగా వెర్సస్ అల్లు.. అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చ సంగతి తెలిసిందే. నిజంగానే ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినా ఇదిగో పుట్టింది.. అంటే అదిగో పెరిగింది అన్న చందంగా ఏ చిన్న చిచ్చు రేగినా రోడ్డుకీడ్చేస్తుంటారు సోషల్ ప్రబుధ్దులు వీరి విషయంలో.
ఈ నేపథ్యంలోనే ఈ మధ్య వాంటెడ్లీ చేసినా.. అన్‌వాంటెడ్లీ చేసినా.. అల్లు అర్జున్ చేసిన కొన్ని పిచ్చి పనులు, నోటి దురద వేషాల కారణంగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చు చెలరేగింది.
దాంతో, పుట్టు పూర్వోత్తరాలన్నీ తవ్వి తీస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు నెట్టింట. ఈ నేపథ్యంలో.. తాజాగా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఈ చిచ్చును స్విచ్చాప్ చేస్తుందనుకుంటున్నారు.
ఒకే వేదికపై అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో అల్లు అర్జున్.. చూసి రెండు వర్గాల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







