నాని ‘సరిపోదా శనివారం’ గట్టిగానే కొట్టాడుగా.!
- August 30, 2024
నానికి గోల్డెన్ డేస్ నడుస్తున్నాయ్. ఏది పట్టినా బంగారమవుతోంది. అలాగే, ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో చేసిన సినిమా అయినా ‘సరిపోదా శనివారం’ నెక్స్ట్ లెవల్ హిట్ అందుకుంది.
ఫస్ట్ డే టాక్ పాజిటివ్‌గా రావడంతో సినిమాపై అంతటా పాజిటివ్ వైబ్స్ చోటు చేసుకున్నాయ్. ఫస్ట్ డే హౌస్‌ఫుల్స్ అయ్యాయ్ అన్ని ధియేటర్లు. దాంతో, ధియేటర్లు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది వీకెండ్‌కి వచ్చేసరికి.
ఫస్ట్ డే కలెక్షన్సే అనూహ్యంగా రాబట్టేశాడు. తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ, యూఎస్‌లోనూ మంచి టాక్ తెచ్చుకుంది ‘సరిపోదా శనివారం’.
అసలే యూఎస్ మంచి మార్కెట్ వుంది నానికి. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో అక్కడ కూడా భారీ వసూళ్లు కొల్లగొట్టేలానే వున్నాడు.
వివేక్ ఆత్రేయ టేకింగ్, జేక్స్ బిజోయ్ బీజీఎమ్.. నాని, సూర్యల క్యారెక్టరైజేషన్.. ఇలా అన్నీ కలిసొచ్చాయ్ ఈ సినిమాకి. శుక్రవారం ఒక్కరోజు నిలదొక్కుకుంటే ఇక తిరిగి చూసుకోనక్కర్లేదు. మొత్తానికి ‘సరిపోదా శనివారం’ సినిమాకి సంబంధించి నాని ప్రమోషన్లలో చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమంతా ఫలించింది. ఆడియన్స్ మంచి తీర్చునిచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







