వృద్ధాప్య ఛాయల్ని తగ్గించుకోవడమెలా?
- August 30, 2024
వయసుతో పాటూ శరీరంలోనూ కొన్ని మార్పులొస్తుంటాయ్. వాటినే వృద్ధాప్య ఛాయలంటుంటాం. మరి, చర్మం ముడతలు పడడం, జుట్టు తెల్ల బడడంతో పాటూ, కొన్ని రకాల నొప్పులు కూడా వయసు మీద పడేకొలదీ వేధిస్తుంటాయ్.
అయితే, వీటి నుంచి తప్పించుకోవడం సాధ్యమా.? అంటే సాధ్యం కాదు కానీ, కొన్ని రకాల ఆహార పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం.. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను కాస్త నెమ్మదింపచేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏజ్ బార్ అయినట్లుగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది తెల్ల జుట్టు సమస్య. అయితే, ఈ సమస్యకు ఏజ్‌తో అస్సలు సంబంధం లేకుండా పోయింది ప్రస్తుతం తరుణంలో.
ఆ సమస్యను పక్కన పెడితే, మరో సమస్య చర్మం ముడతలు పడడం. ముఖ్యంగా ముఖంపై.. కళ్లకింద చర్మం ముడతలు పోతుంది. దీన్ని పూర్తిగా తగ్గించలేకపోయినా.. కాస్తయినా అదుపులో వుంచేందుకు ఈ ఆహార పదార్ధాలు తోడ్పడతాయ్.
ఆకుకూరల్లో పాలకూరకు వృద్దాప్య ఛాయల్ని నెమ్మది చేసే గుణం ఎక్కువ. అలాగే బెర్రీ జాతి పండ్లలోనూ వృద్ధాప్య ఛాయల్ని తగ్గించే గుణం పుష్కలంగా వుందని చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ.. ఇలా ఏమైనా తీసుకోవచ్చు.
ఉడికించిన గుడ్డులోని బయోటిన్‌కి ఏంటీ ఏజింగ్ సమర్ధత ఎక్కువ. అందుకే వయసు మీద పడ్డాకా ఉడికించిన గుడ్డు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. దీంతో పాటూ, డ్రైఫ్రూట్స్ కూడా ప్రతీరోజూ ఓ గుప్పెడు తీసుకోవాలని సూచిస్తున్నారు.
స్వీట్ పొటాటో (చిలగడ దుంప)కు చర్మాన్ని తాజాగా వుంచే గుణం ఎక్కువ. అందుకే దీన్ని తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కాస్త నెమ్మదిస్తాయ్.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!