‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి, ప్రబాస్‌ని అలా మార్చేస్తాడా.?

- August 30, 2024 , by Maagulf
‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి, ప్రబాస్‌ని అలా మార్చేస్తాడా.?

సందీప్ రెడ్డి సినిమాల్లో హీరోలు ఈ తరహాలో వుంటారు.. అని ఓ క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్‌కి. వైల్డ్ నేచర్ ఆఫ్ క్యారెక్టర్‌లో హీరోలను చూపించడమే సందీప్ రెడ్డి ప్రత్యేకత.
ఆ ప్రత్యేకతను తిట్టుకుంటూనే విమర్శిస్తూనే మెచ్చుకుంటున్నారు ఆడియన్స్. అలాగే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయ్.
ఇక, ఇప్పుడు ప్రబాస్ వంతొచ్చింది. ఆయన దర్శకత్వంలో ప్రబాస్ ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది. ఈ సినిమాలో ప్రబాస్‌ని కాస్త నెగిటివ్ షేడ్స్‌లో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి అని తెలుస్తోంది.
ఆల్రెడీ న‘కల్కి’ సినిమాలో ప్రబాస్ నెగిటివ్ షేడ్స్ చూశాం. కానీ, సందీప్ రెడ్డి చూపించబోయే నెగిటివ్ షేడ్స్ అలా ఇలా వుండవంటున్నారు. అయితే, ‘కల్కి’లో ప్రబాస్ వేరు. ‘స్పిరిట్’ పూర్తి భిన్నంగా వుండబోతోందట.
మరి, ఆ రోల్‌లో ప్రబాస్‌ని తెలుగు ఆడియన్స్ ఏక్‌సెప్ట్ చేయగలరా.? అటు బాలీవుడ్‌లోనూ ప్రస్తుతం ప్రబాస్‌పై దారుణంగా నెగిటివిటీ చోటు చేసుకుంది. రీసెంట్‌గా ఓ బాలీవుడ్ నటుడు ప్రబాస్‌పై చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ‘స్పిరిట్’‌కి తంటాలు తప్పేలా లేవు. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com