మహిళలు, చిన్నారుల పై అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి: ప్రధాని మోడీ
- August 31, 2024
న్యూఢిల్లీ: దేశంలోని మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇది వారి భద్రతకు మరింత భరోసానిస్తుందన్నారు.భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలో జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు ప్రారంభ సెషన్లో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. న్యాయవ్యవస్థలపై ప్రజలు ఎన్నడూ అపనమ్మకం చూపలేదన్నారు.ఇక ఇదే సదస్సులో దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రస్తావించారు. మహిళపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలని అన్నారు.
‘మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో ఎంత వేగంగా న్యాయం జరుగుతుందో.. అప్పుడే వారి భద్రతపై ఎక్కువ భరోసా ఏర్పడుతుంది. దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇప్పటికే అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలి. 2019లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం కింద సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే మహిళలపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయి’ అని ప్రధాని మోడీ అన్నారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!