ఒమన్ తీరం దాటనున్న అస్నా తుఫాను..హెచ్చరిక..!
- August 31, 2024
మస్కట్: అస్నా తుఫాను మరో 24 గంటల్లో ఒమన్ సముద్రం తీరం దాటి దక్షిణ దిశగా నైరుతి వైపుకు వస్తుందని, దీంతో సుల్తానేట్ తీరాలపై అధిక ప్రభావం ఉంటుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ)లోని వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్-ఖదౌరి అలెర్ట్ జారీ చేశారు. ప్రస్తుత ఉపగ్రహ చిత్రాలు , విశ్లేషణలు తుఫాను కేంద్రం అరేబియా సముద్రానికి ఈశాన్య దిశలో దాదాపు 635 కిలోమీటర్ల దూరంలో రాస్ అల్ హద్ద్ వద్ద కేంద్రీకృతం అయిందని తెలిపాయి. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం వరకు 10 నుండి 30 మి.మీ వరకు వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ షర్కియా, నార్త్ షర్కియా, మస్కట్ మరియు అల్ వుస్తాలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇది వాడి ప్రవాహానికి దారితీయవచ్చని హెచ్చరించారు. మంగళవారం ఉదయం నాటికి తుఫాను ప్రభావం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఒమన్ సముద్రం, అరేబియా సముద్ర తీరాల వెంబడి 3 నుండి 5 మీటర్ల వరకు అలల ఎగసిపడే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







