‘కానిస్టేబుల్’ అవతారమెత్తిన లవర్ బాయ్.!
- August 31, 2024
‘హ్యాపీ డేస్ సినిమాతో యూత్ టార్గెట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన కుర్రాడు వరుణ్ సందేశ్. తొలి సినిమా విజయంతో పాటూ, ఆ తర్వాత వరుస విజయాల్ని ఖాతాలో వేసుకుని సక్సెస్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత విజయాలు కాస్త దూరం కావడంతో రేస్‌లో బాగా వెనకబడిపోయాడు వరుణ్ సందేశ్.
బిగ్‌బాస్ గేమ్ షోతో కాస్త పాపులారిటీ సంపాదించుకున్నా అది కూడా కెరీర్‌కి ఏమాత్రం యూజ్ కాలేదు. ఇటీవలే తన ఇమేజ్‌కి భిన్నంగా విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
‘నింద’, ‘విరాజి’ సినిమాలు వరుణ్ సందేశ్‌ని ప్రేక్షకులు మళ్లీ కొత్తగా గుర్తు చేసుకునేలా చేశాయ్. ఇప్పుడు ‘కానిస్టేబుల్’ అంటూ మరో సినిమాతో వస్తున్నాడు. లేటెస్ట్గా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ సందేశ్‌కి జోడీ మధులిక వారణాసి అనే కొత్తమ్మాయి ఇండస్ట్రీ కి పరిచయమవుతోంది. ‘కానిస్టేబుల్’ ఓ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.. అంటూ వరుణ్ సందేశ్ ఈ సందర్భంగా తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు. చూడాలి మరి, ‘విరాజి’గా ఇటీవలే మెప్పించిన వరుణ్ సందేశ్ తదుపరి ‘కానిస్టేబుల్’గా ఎలాంటి థ్రిల్ ఇవ్వనున్నాడో.!
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …