స్లీపర్ ట్రైన్ ప్రోటోటైప్ వెర్షన్ ఆవిష్కరణ...
- September 01, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు (ఆదివారం) వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్ను ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ఫెసిలిటీలో వీటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వందేభారత్ చైర్ కార్ విజయం తర్వాత….వందే భారత్ స్లీపర్ కోచ్ల కోసం చాలా శ్రమించామన్నారు.కొత్త రైలు రూపకల్పన చాలా క్లిష్టమైన పని అని, వందే భారత్ స్లీపర్ కార్లలో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు.
వీటి తయారీ ఇప్పుడే పూర్తయిందని, పది రోజుల పాటు కఠిన పరీక్షలు, ట్రయల్ రన్స్ నిర్వహిస్తామని వైష్ణవ్ తెలిపారు.రానున్న మూడు నెలల్లో వందే భారత్ స్లీపర్ కోచ్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.వందే భారత్లో నాసిరకం ఆహార పదార్థాల ఫిర్యాదుల పై మంత్రి మాట్లాడుతూ, భారతీయ రైల్వే రోజుకు 13 లక్షల భోజనాన్ని అందిస్తోందని, ఫిర్యాదులు 0.01 కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు.
అయితే ఇప్పటికే అందిన ఫిర్యాదులపై చాలా ఆందోళన చెందుతున్నామని… సంబంధిత క్యాటరర్లు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.కాగా, బీఈఎంఎల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వందేభారత్ తయారీ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. బీఈఎంఎల్ కాంప్లెక్స్ సమీపంలో 9.2 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హ్యాంగర్ సదుపాయానికి వైష్ణవ్ శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!