TANA మిడ్‌ అట్లాంటిక్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజయవంతం

- September 02, 2024 , by Maagulf
TANA  మిడ్‌ అట్లాంటిక్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజయవంతం

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మిడ్‌ అట్లాంటిక్‌ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన చెస్‌ టోర్నమెంట్‌ విజయవంతమైంది.ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకోసం తీసుకువచ్చారు. పిల్లలు చూపించిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. నిర్వాహకులు కూడా తగిన ఏర్పాట్లు చేయడంతో చదరంగం పోటీలు చక్కగా సాగాయి. వచ్చినవారు ఏర్పాట్లను చూసి నిర్వాహకులను అభినందించారు.ఈ టోర్నమెంట్‌కు డైరెక్టర్‌గా జాషువా మిల్టన్‌ ఆండర్సన్‌ వ్యవహరించారు. ఈ టోర్నమెంట్‌ను ఫణి కంతేటి ఆర్గనైజ్‌ చేశారు.  తానా నాయకులు రవి పొట్లూరి (బోర్డ్‌ డైరెక్టర్‌), నాగ పంచుమర్తి (స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌), వెంకట్‌ సింగు (మిడ్‌-అట్లాంటిక్‌ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌) ఈ పోటీల విజయవంతానికి కృషి చేశారు. ఈ పోటీలకు రంజిత్‌ మామిడి, నాయుడమ్మ యలవర్తి, వెంకట్‌ ముప్పా, విశ్వనాథ్‌ కోగంటి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాలా, ప్రసాద్‌ క్రోతపల్లి. ప్రసాద్‌ కస్తూరి, సంతోష్‌ రౌతు వలంటీర్లుగా వ్యవహరించారు.

చెస్‌ టోర్నమెంట్‌ విజేతలు:
 ఈ చెస్‌ టోర్నమెంట్‌లో విజేతల వివరాలను ప్రకటించారు.ప్రణవ్‌ కంతేటి, సిద్ధార్థ్‌ బోస్‌, లలిత్‌ కృష్ణ ఉప్పు, అఖిల్‌ కపలవాయి, అధ్వైత్‌ ఆదవ్‌ వాసుదేవ్‌, దేబబ్రత చౌదరి, సజీవ్‌ సింగారవేలు, సాయిశ్రీసమర్థ్‌ పెన్నేటి, సహర్ష్‌ నన్నపనేని, ర్యాన్‌ బుచా, రేయాన్ష్‌ రెడ్డి ఎల్ల, జోసెఫ్‌, ఆద్య తాతి విజేతలుగా నిలిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com