తొలి 9 గంటల్లో 500 వాహన యాజమాన్య బదిలీ..!

- September 03, 2024 , by Maagulf
తొలి 9 గంటల్లో 500 వాహన యాజమాన్య బదిలీ..!

కువైట్: 'సహెల్' యాప్‌లో వెహికల్ ఓనర్షిప్ సేవను ప్రారంభించిన మొదటి తొమ్మిది గంటల్లోనే వాహన యాజమాన్యాన్ని బదిలీ చేయడం కోసం అంతర్గత మంత్రిత్వ శాఖకు 500 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ సేవ ప్రైవేట్ కార్లు మోటార్ సైకిళ్ల యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి మాత్రమే అందుబాటులో ఉంది.   అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదివారం 'సహెల్' యాప్ ద్వారా వాహనాల యాజమాన్య బదిలీ సేవను ప్రారంభించిన విషయం తెలిసిందే. వెహికిల్ ఓనర్, కొనుగోలుదారు ట్రాఫిక్ విభాగాన్ని సందర్శించకుండా యాప్ ద్వారా యాజమాన్య బదిలీని పూర్తి చేయవచ్చని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌లోని ట్రాఫిక్ వ్యవహారాలు మరియు కార్యకలాపాల విభాగంలోని టెక్నికల్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అల్-అద్వానీ వెల్లడించారు.  ఇలాంటి డిజిటల్ కార్యక్రమాలు మంత్రిత్వ శాఖ కార్యాలయాలపై అదనపు భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com