శౌరా కౌన్సిల్.. కొత్తగా 19 మంది మహిళల నియామకం

- September 03, 2024 , by Maagulf
శౌరా కౌన్సిల్.. కొత్తగా 19 మంది మహిళల నియామకం

రియాద్: సౌదీ శౌరా కౌన్సిల్ లో కొత్తగా 19 మంది మహిళలు చేరారు. శాసన ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా గణనీయమైన పురోగతిగా నిపుణులు అభిప్రాయపడ్డారు. కౌన్సిల్ లో మొత్తం 150 సీట్లలో ఇప్పుడు మహిళలు 20 శాతం ఉన్నారు.  3/3/1446 నుండి ప్రారంభమయ్యే నాలుగు హిజ్రీ సంవత్సరాల కాలానికి శౌరా కౌన్సిల్‌ను పునర్నిర్మించడానికి రాజు సల్మాన్ జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా ఆమోదించింది. షౌరా కౌన్సిల్ స్పీకర్‌గా షేక్ డాక్టర్ అబ్దుల్లా అల్-షేక్, డిప్యూటీ స్పీకర్‌గా డాక్టర్ మిషాల్ అల్-సలామీ,  అసిస్టెంట్ స్పీకర్‌గా డాక్టర్ హనన్ అల్-అహ్మదీ లను నియమించారు. 

మొత్తం 150 మంది సభ్యులలో 30 మంది మహిళలు ఉన్నారు. వారిలో 19 మంది మొదటిసారిగా కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. కొత్తగా నియమితులైన వారిలో డాక్టర్ అర్వా అల్ రషీద్, డాక్టర్ ఇష్రాక్ రఫేయి, డాక్టర్ అమల్ కత్తాన్, డాక్టర్ అమల్ అల్-హజానీ, డాక్టర్ బుష్రా అల్-హమద్,  డాక్టర్ తక్వా ఒమర్, డాక్టర్ ఐషా అరిషి, డాక్టర్ అహూద్ అల్-షహీల్, డాక్టర్ ఘడా అల్-హుధాలీ, డాక్టర్ లుబ్నా అల్-అజ్మీ, డాక్టర్ లైలా ఫదా, డాక్టర్ నిహాద్ అల్-ఒమైర్, డాక్టర్ హింద్ అల్-ఖమ్మాష్, డాక్టర్ దలాల్ నమన్‌ఖానీ, డాక్టర్ రిమా అల్-యాహ్యా, డాక్టర్ సారా ఖాసిమ్, డాక్టర్ ఐషా జకారీ వంటి ప్రముఖలు ఉన్నారు.  ఇదిలా ఉండగా డాక్టర్ అస్మా అల్ మువైషర్, డాక్టర్ అమల్ అల్ షేక్, ప్రిన్సెస్ డాక్టర్ అల్ జవరా అల్ సౌద్, డాక్టర్ ఇమాన్ అల్-జబ్రీన్, డాక్టర్ అమీరా వంటి వారు కౌన్సిల్‌లో రెండవ, మూడవ పదవీకాలం కొనసాగుతున్నారు. 2013లో తొలిసారిగా 30 మంది మహిళలను షౌరా కౌన్సిల్‌లో నియమించారు. అప్పట్లో ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా గుర్తింపు పొందింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com