57 మంది బంగ్లాదేశీయులకు ఊరట.. శిక్షలు ఎత్తివేత.. యూఏఈ అధ్యక్షుడు ఆదేశాలు..!

- September 03, 2024 , by Maagulf
57 మంది బంగ్లాదేశీయులకు ఊరట.. శిక్షలు ఎత్తివేత.. యూఏఈ అధ్యక్షుడు ఆదేశాలు..!

యూఏఈ: ఎమిరేట్స్‌లో గత నెలలో నిరసనలలో పాల్గొన్న బంగ్లాదేశ్ పౌరులకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ క్షమాపణ ప్రసాదించారు. దోషులపై శిక్షలను ఎత్తివేయాలని వారిని దేశం నుండి బహిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రెసిడెంట్ ఆదేశాలతో యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ అల్ షమ్సీ.. శిక్షల అమలును నిలిపివేయాలని, బహిష్కరణ ప్రక్రియలను ప్రారంభించాలని ఉత్తర్వు జారీ చేశారు.    

అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూఏఈలో ఉన్న బంగ్లా దేశీయులు నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలకు పిలుపునిచ్చినందుకు అల్లర్లను ప్రేరేపించినందుకు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జూలై 22న ముగ్గురు బంగ్లాదేశీయులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి సమావేశంలో పాల్గొన్నందుకు మరో 53 మందికి 10 ఏళ్ల శిక్ష, ఒక నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com