‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్.! ధియేటర్లు దద్దరిల్లిపోయాయ్.!
- September 03, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
రీ రిలీజ్ సినిమా అయినా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనూహ్యమైన వసూళ్లు వచ్చాయ్ ఈ సినిమాకి. ఓ వైపు భారీ వర్షాలూ, వరదలూ.. అయినా లెక్క చేయకుండా ధియేటర్లకు జనం విచ్చల విడిగా వచ్చేశారు.
విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులే. ధియేటర్లలో అభిమానుల సందడి మోత మోగిపోయింది. అదేదో కొత్త సినిమా రిలీజ్ అన్నట్లుగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్లూ వద్దని అభిమానులకి సూచించిన పవన్ కళ్యాణ్.. ఆయన సూచనను తూచా తప్పకుండా పాటించారు అభిమానులు. కానీ, ’గబ్బర్ సింగ్‘ రిలీజైన ధియేటర్లలో (ఇండోర్) మాత్రం తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.
నిజానికి ఈ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ జీవితంలో.. అలాగే, ఆయన అభిమానులకీ చాలా చాలా ప్రత్యేకం. దాదాపు పదేళ్ల నిర్విరామ రాజకీయ కృషి ఫలించిన రోజు. అలాంటిది ఆ వేడుకను ఘనంగా జరుపుకోవడానికి లేదని ఫ్యాన్స్లో ఒకింత వెలితి వున్నప్పటికీ, ‘గబ్బర్ సింగ్’ సినిమా ఒకింత రిలీఫ్గా సరిపెట్లుకున్నారు అభిమానులు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!