టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిన ఎతిహాద్ విమానం..!
- September 03, 2024
యూఏఈ: అబుదాబి బయలుదేరిన ఎతిహాద్ విమానం పక్షులను ఢీకొట్టిన అనంతరం కొలంబోకు తిరిగి వచ్చింది. సెప్టెంబర్ 3న కొలంబో బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం (CMB) నుండి అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH)కి వెళ్లాల్సిన EY395 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిందని అధికారులు తెలిపారు. జరిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. పక్షులను ఢీకొట్టడం ప్రమాదకరమని, తనిఖీల తర్వాత తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తామని విమానయాన సంస్థ తెలిపింది.తనిఖీల అనంతరం ఎతిహాద్ విమానం కొలంబో నుండి బయలుదేరిందని వెల్లడించారు. 4 గంటల 55 నిమిషాల ఆలస్యంతో మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటలకు అబుదాబికి విమానం చేరుకుందని, వాస్తవానికి ఈవై395 విమానం మంగళవారం ఉదయం 7.45 గంటలకు అబుదాబి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే స్థానిక ఫోన్ నంబర్లు, లైవ్ చాట్ మరియు సోషల్ మీడియా ద్వారా తమను సంప్రదించాలని ఎతిహాద్ ఎయిర్వేస్ ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..