దుబాయ్ లో పాఠశాలల్లో తనిఖీలు.. మూడు స్కూల్స్ మూసివేత..!
- September 04, 2024
దుబాయ్: నాణ్యతా ప్రమాణాలను పాటించనందున 2023-2024 విద్యా సంవత్సరంలో మూడు దుబాయ్ పాఠశాలలు మూసివేసినట్టు దుబాయ్‌లోని ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ వెల్లడించింది. ‘మీట్ ది సీఈఓ’ కార్యక్రమంలో నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) ఈ సమాచారాన్ని షేర్ చేసింది.
అయితే, దుబాయ్‌లోని ప్రైవేట్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో తనిఖీలు చేయబోమని ప్రకటించింది. కానీ పాఠశాలలు పూర్తి తనిఖీ కోసం దుబాయ్ స్కూల్స్ ఇన్‌స్పెక్షన్ బ్యూరో (DSIB)కి ఫిర్యాదు అందితే.. అథారిటీ నిబంధనలకు లోబడి తనిఖీలు నిర్వహిస్తారు. KHDA డైరెక్టర్ జనరల్ ఐషా మిరాన్ మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సన్నాహాలు జనవరిలో ప్రారంభమయ్యాయని, 50కి పైగా సెషన్‌లు ఉన్నాయని, 700 కంటే ఎక్కువ మంది వ్యక్తులు, 290 విద్యాసంస్థలు తల్లిదండ్రులు, అధ్యాపకుల నుండి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. దుబాయ్‌లో ప్రస్తుతం 223 ప్రైవేట్ పాఠశాలలలో 365,000 మంది విద్యార్థులు చదువుతున్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!