మాజీ సీజేఐ ఎన్వీ రమణ విరాళం - కీలక సూచన..!!

- September 04, 2024 , by Maagulf
మాజీ సీజేఐ ఎన్వీ రమణ విరాళం - కీలక సూచన..!!

వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా దెబ్బ తిన్నాయి. ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటికీ విజయవాడ, ఖమ్మం వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రజలు విజయవాడ వీడి వెళ్తున్నారు.

ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. ఇదే సమయంలో బాధితులకు అండగా పలువురు ప్రముఖులు ఆర్దిక సాయం ప్రకటిస్తున్నారు. సీనీ హీరోలు స్పందిస్తున్నారు.

వీడని వరద
తెలుగు రాష్ట్రాల్లో వదర బీభత్సం భారీ నష్టం మిగిల్చింది. విజయవాడ ను పూర్తిగా వరద వీడలేదు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆహారం అందక పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్ధం విరాళం అందజేసారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయల చెక్ ను రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ అందచేసారు.

విరాళాల ప్రకటన
వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాజీ సీజేఐ ఎన్వీ రమణ అందచేసారు. ఇలాంటి విపత్కర సమయాల్లో బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్..మాజీ సీఎం జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయాల చొప్పున ఆర్దిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు.

ప్రభుత్వం పిలుపు
సినీ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, విశ్వక్సేన్, దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ, ఎస్‌. నాగవంశీ కలసి రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 50 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు హీరో సిద్ధు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 30 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఏ రూపంలో అయినా బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందు కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com