వామ్మో.! త్రిష డైరీ ఇప్పట్లో ఖాళీ అయ్యేదే లేదుగా.!

- September 04, 2024 , by Maagulf
వామ్మో.! త్రిష డైరీ ఇప్పట్లో ఖాళీ అయ్యేదే లేదుగా.!

సీనియర్ నటి త్రిష కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా నడుస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు జోడీగా ఫస్ట్ ప్లేస్‌లో వుంటోంది త్రిష పేరు.

తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా త్రిష నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది త్రిష.

అలాగే తమిళంలో అజిత్ హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్‌తో ‘రామ్’ అనే సినిమాలో నటిస్తోంది.

ఇప్పుడు అజిత్‌తోనే మరో సినిమాకి ఓకే చేసిందట తమిళంలో త్రిష. ఆ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్ తమిళంలో నిర్మిస్తోందనీ సమాచారం.

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన త్రిష, ఆ తర్వాత టాలీవుడ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ అయిపోయింది.

మళ్లీ ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలకు జోడీగా వివిధ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులుండగా తాజాగా మైత్రీ వారి తమిళ ప్రాజెక్ట్ అదనంగా వచ్చి చేరింది. చూస్తుంటే, త్రిష ఇప్పట్లో ఖాళీ అయ్యే పరిస్థితే కనిపించడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com