చిన్న నటి పెద్ద మనసు.! వరద బాధితులకు చేసిన సాయం ‘అనన్య’మే.!
- September 04, 2024
తెలుగు రాష్ట్రాల్ని భారీ వర్షాలూ, వరదలూ ముంచెత్తుతున్నాయ్. ఆపన్న హస్తం కోసం వరద ముంపులో చిక్కుకున్న జనం ఆర్త నాదాలు చేస్తున్నారు.
ప్రభుత్వాలు సకాలంలో స్పందించి బాధితులకు తగిన సహాయ సౌకర్యాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే తెలుగు చిత్ర సీమ తనదైన స్థాయిలో పెద్ద మనసు చాటుకుంది.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీయార్, అల్లు అర్జున్, ప్రబాస్ తదితర స్టార్ హీరోలు తమ వంతుగా కోటి రూపాయల చొప్పున ఇరు తెలుగు రాష్ట్రాలకూ సాయమందించారు.
కోట్లలో రెమ్యునరేషన్లు తీసుకునే సెలబ్రిటీలే కాదు, మా వంతుగా మేమూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటాం అంటూ కొందరు చిన్న సెలబ్రిటీలు సైతం ముందుకొచ్చారు.
అందులో అందాల భామ అనన్య నాగళ్ల పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూ, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటుతోన్న అనన్య నాగళ్ల తన వంతుగా 5 లక్షల రూపాయల్ని వరద బాధితుల కోసం అందించింది.
ఆమె సాయాన్ని అందరూ స్పూర్తిగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇటీవలే ‘మంత్ర’ తదితర సినిమాలతో అనన్య నాగళ్ల తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!