క్షమాభిక్ష.. ఓవర్‌స్టేయర్‌ల రెసిడెన్సీ స్టేటస్.. GDRFA కీలక సూచనలు..!
- September 04, 2024
యూఏఈ: యూఏఈలో ఓవర్స్టేయర్లు తమ రెసిడెన్సీ స్టేటస్‌ని క్రమబద్ధీకరించుకోవాలనుకునేవారు, దేశంలో నివాసం కొనసాగించాలని కోరుకునే వారు మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుండి వర్క్ పర్మిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి స్పష్టం చేశారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఈ డాక్యుమెంట్ కీలకమన్నారు. యూఏఈలో నివాసం కొనసాగించాలనుకునే ప్రవాసులు తమ రెసిడెన్సీ స్థితిని చట్టబద్ధం చేయడానికి వారి దరఖాస్తులో భాగంగా చెల్లుబాటు అయ్యే MoHRE వర్క్ పర్మిట్‌ను సమర్పించాలని సూచించారు. దాని స్థానంలో కంపెనీ ఆఫర్ లెటర్ ప్రామాణికమైన పత్రం కాదని అల్ మర్రి అన్నారు. వర్క్ పర్మిట్ వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, యూఏఈ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నాడని చూపిస్తుందని స్పష్టం చేశారు. క్షమాభిక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ప్రవాసులు తమ స్టేటస్‌ను క్రమబద్ధీకరించుకోవడానికి సంబంధిత కేంద్రాలను సంప్రదించే ముందు వర్క్ పర్మిట్‌తో సహా అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్లను సేకరించవలసిందిగా సూచించారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!