సౌదీ అరేబియాలో శామ్సంగ్ పే..!
- September 04, 2024
రియాద్: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) 2024 నాల్గవ త్రైమాసికంలో సౌదీ అరేబియాలో శామ్సంగ్ పే (Samsung Pay)ని ప్రారంభించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. రియాద్‌లో జరిగిన ప్రారంభ 24 ఫిన్‌టెక్ సదస్సులో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సౌదీ విజన్ 2030 కింద ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్ఎస్డిపి) లక్ష్యాలకు అనుగుణంగా సౌదీ అరేబియాలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో ఇది కీలక అడుగుగా సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. Samsung Pay అధునాతన, సురక్షితమైన చెల్లింపు అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. తాజా ఒప్పందం రాజ్యమంతటా ఫిన్‌టెక్ సొల్యూషన్ల వినియోగాన్ని విస్తరించడానికి దోహదం చేస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను Samsung Pay అందిస్తుందన్నారు. ఫిన్టెక్లో గ్లోబల్ లీడర్‌గా ఉండాలనే సౌదీ అరేబియా లక్ష్యానికి తాజా ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..