బహ్రెయిన్ లో అవయవ దానానికి గ్రీన్ సిగ్నల్..!
- September 04, 2024
మనామా: బహ్రెయిన్ క్యాబినెట్ మానవ అవయవాల బదిలీ, మార్పిడిపై నిబంధనలను ప్రవేశపెట్టడానికి కీలకమైన మెమోరాండమ్‌ను ఆమోదించింది. ఆరోగ్య సంరక్షణతోపాటు ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. తాజా నిర్ణయం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతంలో అవయవ మార్పిడిలో బహ్రెయిన్ అగ్రగామిగా నిలిచేందుకు దోహదం చేస్తుందన్నారు.
గత ఏడాది జూన్‌లో తొలుత ఈ చట్టాన్ని ఎంపీ డాక్టర్ మరియం అల్ ధాన్ ప్రతిపాదించారు. అవయవ దానంకు మద్దతు ఇచ్చే చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనితో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతం కావడంతోపాటు మానవ జీవితాలను రక్షించడానికి స్పష్టమైన చట్టం ఏర్పడుతుందని వివరించారు. రాబోయే పార్లమెంటరీ సెషన్లో ఈ కీలకమైన చట్టాన్ని ముందుకు తీసుకురావాలని డాక్టర్ అల్ ధాన్ సూచించారు.
బహ్రెయిన్‌లో అవయవ దానం నియంత్రణకు చట్టం ఆవశ్యకత గురించి డాక్టర్ అల్ ధాన్ మాట్లాడుతూ.. బహ్రెయిన్‌లో అవయవ మార్పిడి అనేది రోగుల ప్రాణాలను కాపాడటానికి ఉన్న అతిముఖ్యమైన మార్గమన్నారు. బహ్రెయిన్‌లో కిడ్నీ, కాలేయ మార్పిడి కోసం వేలాది మంది వేచి చూస్తున్నారని, తాజా చట్టం నిరీక్షణ కాలాన్ని తగ్గింస్తుందని తెలిపారు. ముసాయిదా చట్టం త్వరలోనే అమలులోకి వస్తుందని, బహ్రెయిన్‌లోని రోగులకు ప్రయోజనాలను అందజేస్తుందని డాక్టర్ అల్ ధాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!