పారాలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర..
- September 05, 2024
పారిస్: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అంచనాలను మించి రాణిస్తున్నారు. పతకాల మోత మోగిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన పతకాల సంఖ్య(19)ను ఎప్పుడో అధిగమించేశారు. తాజాగా ఈ సారి పెట్టుకున్న 25 పతకాల లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచారు. బుధవారానికి భారత్ ఖాతాలో 24 పతకాలు వచ్చి చేరాయి. మరో నాలుగు రోజులు పాటు ఇంకా క్రీడలు జరగనున్న నేపథ్యంలో భారత్ మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది.
బుధవారం భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్య పతకం సాధించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్ టీ-63 విభాగంలో శరద్ కుమార్ రజతం, తంగవేలు మరియప్పన్ కాంస్య (1.85 మీటర్లు) పతకాలను సొంతం చేసుకున్నారు. శరద్ కుమార్ 1.88 మీటర్లు, తంగవేలు 1.85 మీటర్ల ఎత్తు దూకారు. ఇక జావెలిన్ త్రోలో అజీత్ ఎఫ్-46 విభాగంలో రజతం, గుర్జర్ సుందర్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడు.
పురుషుల క్లబ్ త్రో(ఎఫ్51)లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేశారు. స్వర్ణ, రజత పతకాలను అందించారు. ధరంబీర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించగా, ప్రణవ్ రజతాన్ని గెలుచుకున్నారు. ధరంబీర్ 34.92 మీటర్ల దూరం త్రోతో గోల్డ్ మెడల్ గెలవగా ప్రణవ్ 34.59 మీటర్ల త్రో తో రెండో స్థానంలో నిలిచాడు.
ఇక షాట్‌పుట్ ఎఫ్-46 విభాగంలో సచిన్ సర్జేరావు ఖిలారీ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు.. 16.32 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఆర్చరీలో హర్విందర్ సింగ్ స్వర్ణం సాధించాడు.ఈ క్రమంలో పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత ఆర్చర్ గా హర్విందర్ చరిత్రకెక్కాడు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







