గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి అలర్ట్.. ఇక పై వీకెండ్ క్రూయిజ్ లు !
- September 06, 2024
గల్ఫ్ దేశాల్లో ఉన్నవారికి కీలక బిగ్ అప్డేట్ వచ్చింది.రిసార్ట్స్ వరల్డ్ క్రూయిజ్ లలో ప్రయాణించాలనుకునే వారి కోసం గల్ఫ్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇందులో భాగంగానే దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం, రిసార్ట్స్ వరల్డ్ క్రూసెస్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. నవంబర్ 1, 2024 నుండి గల్ఫ్‌లో రిసార్ట్స్ వరల్డ్ వన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది రిసార్ట్స్ వరల్డ్ క్రూసెస్. నవంబర్ 1, 2024 నుండి ఏప్రిల్ 2025 ఉంటుందని కూడా ప్రకటించారు.అది కూడా మిడిల్ ఈస్ట్‌లో అరంగేట్రం చేయనుంది రిసార్ట్స్ వరల్డ్ క్రూసెస్.ఇందులో భాగంగానే దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజంతో ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు దుబాయ్‌లో క్రూయిస్ లైన్ ప్రారంభ విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. టూరిస్టుల కోసం మూడు రకాల క్రూయిజ్‌లను ప్రారంభించేందుకు సిద్ధం అయింది రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్. వీటిలో రెండు రాత్రుల పాటు ప్రయాణించే సర్ బని యాస్ వీకెండ్ క్రూయిజ్ ప్రతి శుక్రవారం బయలుదేరుతుంది. 3 నైట్ ఒమన్ (ఖాసబ్-మస్కట్) క్రూజ్ ప్రతి ఆదివారం బయలుదేరుతుంది. 2 నైట్ దోహా క్రూజ్ ప్రతి బుధవారం బయలుదేరుతుంది. ఇక ప్రయాణీకులు 4, 5 లేదా వారం రోజుల పాటు ట్రిప్ వెళ్ళడానికి ప్రత్యేక క్రూయిజ్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్ ప్రకటన చేసింది. ఇక తమ క్రూయిసెస్ లలో అన్ని వసతులు ఉంటాయని తెలిపింది రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్.
ఇక దీని పై రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్ ప్రెసిడెంట్ మైఖేల్ గోహ్ మాట్లాడుతూ...నవంబర్ 1న రిసార్ట్స్ వరల్డ్ వన్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.ఇక ఈ ప్రాజెక్ట్ పై గల్ఫ్ అలాగే ఆసియా దేశాలు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు రిసార్ట్స్ వరల్డ్ క్రూయిసెస్ ప్రెసిడెంట్ మైఖేల్ గోహ్.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







