ముంబైలో బోట్ సీజ్..కువైట్ యజమానికి అప్పగింత..!

- September 06, 2024 , by Maagulf
ముంబైలో బోట్ సీజ్..కువైట్ యజమానికి అప్పగింత..!

కువైట్: కువైట్ బోట్‌ను సీజ్ చేసిన ఏడు నెలల తర్వాత ఓడను దాని యజమానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6న తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు పడవలో ముంబైకి వచ్చారు. అది కువైట్ నుండి వచ్చింది. నవంబర్‌లో ముంబైలో ఉగ్రదాడిని ఎదుర్కొన్న తర్వాత సముద్ర భద్రతను కట్టుదిట్టం చేశారు.  దక్షిణ ముంబైలోని ససూన్ డాక్ సమీపంలో అరేబియా సముద్రంలో కువైట్ పడవను గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు పడవను సీజ్ చేశారు.  ఘటన జరిగిన ఏడు నెలల తర్వాత, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పడవను దాని యజమాని అబ్దుల్లా షరాహిత్‌కు అప్పగించినట్లు అధికారి తెలిపారు. షరాహిత్ ముంబైకి వచ్చి ఇద్దరు లాయర్లతో కలబా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత పడవను అప్పగించారు. కాగా, ముగ్గురు వ్యక్తులు 10 రోజులకు పైగా పడవలో ప్రయాణించి కువైట్ నుండి ముంబై తీరానికి చేరుకున్నారు. ఈ ముగ్గురూ జీపీఎస్ పరికరం సాయంతో ముంబై చేరుకున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com