'ప్రపంచంలోని ఉత్తమ MICE ఎయిర్‌లైన్'గా ఖతార్ ఎయిర్‌వేస్..!
- September 06, 2024
దోహా: వియత్నాంలోని హో చి మిన్ సిటీలో సెప్టెంబర్4న జరిగిన వరల్డ్ MICE అవార్డ్స్‌లో ఖతార్ ఎయిర్‌వేస్ 'వరల్డ్స్ బెస్ట్ MICE ఎయిర్‌లైన్ 2024'గా ఎంపికైనట్లు ప్రకటించారు. అదే విధంగా 'మిడిల్ ఈస్ట్స్ బెస్ట్ MICE ఎయిర్‌లైన్ 2024'గా కూడా ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా టూరిజంను అభివృద్ధి చేసినందుకు కృషి చసే ఎయిర్ లైన్స్ సంస్థలకు MICE అవార్డులను అందజేస్తారు. ఖతార్ ఎయిర్‌వేస్‌కు MICE అవార్డు రావడం వరుసగా రెండో సారి అని ఖతార్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ థియరీ ఆంటినోరి హర్షం వ్యక్తం చేశారు. "ఖతార్ ఎయిర్‌వేస్ వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచంలోని ఉత్తమ MICE ఎయిర్‌లైన్ మరియు మిడిల్ ఈస్ట్ యొక్క ఉత్తమ MICE ఎయిర్‌లైన్ 2024 అవార్డులను అందుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ గుర్తింపు దక్కడం మా కృషికి నిదర్శనం. మా వన్-స్టాప్ డిజిటల్ ట్రావెల్ సొల్యూషన్, QMICE ద్వారా గ్లోబల్ MICE పరిశ్రమ, ప్రత్యేకమైన ఛార్జీలు, ప్రయాణ సౌకర్యాల, MICE నిపుణుల కోసం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది." అని వివరించారు.
తాజా వార్తలు
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







