సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కి కృతజ్ఞతలు తెలిపిన పుతిన్
- September 06, 2024
రియాద్: అమెరికా, రష్యాల మధ్య అతిపెద్ద ఖైదీల మార్పిడికి సహకరించినందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికన్ జర్నలిస్ట్ ఇవాన్ గెర్ష్‌కోవిచ్, యుఎస్ మాజీ మెరైన్ పాల్ వీలన్ రష్యా నిర్బంధం నుండి విముక్తి పొందిన గంటల తర్వాత ఆగష్టు 1న యునైటెడ్ స్టేట్స్‌కు తిరిగి వచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య అతిపెద్ద ఖైదీల మార్పిడిలో భాగంగా ఒక సంవత్సరానికి పైగా పూర్తి రహస్యంగా పనిచేసిన స్వాప్ ఒప్పందంలో 24 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 16 మంది రష్యా నుండి వెళ్లగా, 8 మంది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి రష్యాకు తిరిగొచ్చారు.
రష్యాలోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ఎన్ వ్లాడివోస్టాక్‌లో పుతిన్ ప్రసంగిస్తూ.. ఖైదీల మార్పిడికి సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ చురుకైన పాత్ర పోషించారని, తమపౌరులు స్వదేశానికి తిరిగి రావడానికి తోడ్పాటు అందించినందుకు కృతజ్ఞులం అని ప్రకటించారు. అలాగే చర్చల వేదికను ఏర్పాటు చేసిన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు కూడా పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!