డొమెస్టిక్ వర్కర్స్, యజమానులు పరస్పర ఫిర్యాదు.. ఇలా ఉపసంహరించుకోండి..!

- September 06, 2024 , by Maagulf
డొమెస్టిక్ వర్కర్స్, యజమానులు పరస్పర ఫిర్యాదు.. ఇలా ఉపసంహరించుకోండి..!

యూఏఈ: ఇప్పుడు గృహ కార్మికులను నియమించుకోవడం చాలా సాధారణం అయింది.అదే సమయంలో వారు పారిపోయే సంఘటనలు కూడా పెరిగాయి. వీటిని పరిష్కరించడానికి మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ పోలీసు నివేదికను దాఖలు చేయడానికి ఒక ప్రక్రియను ఏర్పాటు చేసింది. అయితే, ఉద్యోగి తిరిగి వచ్చిన సందర్భాలు ఉండవచ్చు లేదా గైర్హాజరు కావడానికి సరైన కారణం ఉన్నట్లు తేలవచ్చు. అదే సయమంలో ఉద్యోగులు తప్పుగా ఫిర్యాదును దాఖలు చేసిన సందర్భాలు కూడా ఉండవచ్చు.  కాగా, గృహ కార్మికులు, యజమానులు ఇద్దరూ MoHRE ద్వారా వారి ఫిర్యాదులను ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించారు.  గృహ కార్మికుల వివాదాలకు సంబంధించిన చట్టాలకు యూఏఈ తాజా సవరణల ప్రకారం.. అన్ని ఉద్యోగి వివాదాలు చివరి ప్రయత్నంగా కోర్ట్ ఆఫ్ అప్పీల్‌కు బదులుగా మొదటి ఫస్ట్ ఇన్ స్టాంట్ కోర్టుకు వెళ్లవచ్చు. MoHREతో అనుకున్న పరిష్కారం రాకుంటే మాత్రమే కేసు కోర్టుకు వెళుతుంది.  

అవసరమైన పత్రాల నుండి రుసుము వరకు, గృహ కార్మికులు యజమానులు ఇద్దరికీ పరారీ నివేదికను ఉపసంహరించుకోవడానికి గైడ్ లైన్స్..

గృహ కార్మికులు
గృహ కార్మికులు MoHRE వెబ్‌సైట్, అప్లికేషన్ లేదా గృహ కార్మికుల కేంద్రాలు లేదా తౌసీల్ వాహనాలను సందర్శించడం ద్వారా ప్రక్రియను ప్రారంభించవచ్చు.ఈ సేవ దుబాయ్ మినహా అన్ని ఎమిరేట్స్‌లో MoHRE ద్వారా అందుబాటులో ఉంది. దుబాయ్‌లో పరారీలో ఉన్న నివేదికను అప్పీల్ చేయాలనుకునే వారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ - దుబాయ్ ద్వారా దీన్ని అప్పీల్ చేయవచ్చు.

అవసరమైన పత్రాలు
గృహ కార్మికుల ఎమిరేట్స్ ID కాపీ
గృహ కార్మికుల పాస్‌పోర్ట్ కాపీ

షరతులు
గృహ కార్మికుడు తప్పనిసరిగా నివాస వీసాను కలిగి ఉండాలి.  అది చెల్లుబాటు అయ్యేది లేదా కాకపోయినా సరే. గృహ కార్మికుడికి వ్యతిరేకంగా యజమాని దాఖలు చేసిన పరారీ నివేదిక వ్యవస్థలో తప్పనిసరిగా రికార్డు ఉండాలి.

ప్రక్రియ
వెబ్‌సైట్ లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సేవను (విత్‌డ్రావల్ ఆఫ్ అబ్స్‌కాండింగ్ రిపోర్ట్) యాక్సెస్ చేసిన తర్వాత గృహ కార్మికులు వారి మొత్తం సమాచారాన్ని పొందుపరచాలి. కార్మికులు అవసరమైన రుసుము చెల్లించాలి. వెరిఫికేషన్ కోసం అప్లికేషన్ ఎలక్ట్రానిక్‌గా మినిస్ట్రీకి రిఫర్ చేస్తుంది. అయితే, ఫిర్యాదును ఉపసంహరించుకునే అవకాశాన్ని వివరించారు.   అబ్కాండింగ్ నివేదికను రద్దు చేసిన తేదీ నుండి ఒక వారం తర్వాత యజమాని ఫైల్ నుండి గృహ కార్మికుల అనుమతిని రద్దు చేయకపోతే, పరారీ నివేదికను నమోదు చేయడానికి యజమానికి SMS ద్వారా తెలియజేయబడుతుంది.  దీనికి రెండు మూడు రోజులసమయం పడుతుంది. ఈలోగా కార్మికులు తమ దరఖాస్తు స్థితిని వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.

రుసుము
వెబ్‌సైట్, అప్లికేషన్ ద్వారా విధించబడే ఫెడరల్ రుసుము Dh115.
వ్యాపార కేంద్రాలు గరిష్టంగా Dh72 వసూలు చేస్తాయి.

యజమానులు
యజమానులు MoHRE వెబ్‌సైట్, అప్లికేషన్ లేదా తషీల్ లేదా టాడ్‌బీర్ కేంద్రాలు లేదా తౌసీల్ వాహనాలలో ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఈ సేవ దుబాయ్ మినహా అన్ని ఎమిరేట్‌లలో యజమానులకు అందుబాటులో ఉంది. దుబాయ్‌లో అమెర్ సెంటర్‌ను సందర్శించాలి. లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ - దుబాయ్ ద్వారా దీన్ని చేయవచ్చు.

అవసరమైన పత్రాలు
గృహ కార్మికుల ఎమిరేట్స్ ID కాపీ
గృహ కార్మికుల పాస్‌పోర్ట్ కాపీ

షరతులు
పనికి గైర్హాజరైనందుకు గృహ కార్మికుడిపై యజమాని ఫిర్యాదు చేయడం గురించి సిస్టమ్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

ప్రక్రియ
యజమానులు MoHRE పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి వారు తప్పనిసరిగా దరఖాస్తును సమర్పించాలి. ఇందుకు సంబంధించిన ఫీజులు చెల్లించాలి.  వెరిఫికేషన్ కోసం దరఖాస్తు మంత్రిత్వ శాఖకు రిఫర్ చేస్తారు. ఏవైనా లోపాలు ఉంటే, కస్టమర్‌లకు టెక్స్ట్ ద్వారా తెలియజేస్తారు. ఆమోదం పొందిన తర్వాత దరఖాస్తు తుది ఆమోదం కోసం ఫెడరల్ అథారిటీకి ఫార్వార్డ్ అవుతుంది. ఈ ప్రక్రియకు మూడు రోజులు పడుతుంది.

రుసుము
వెబ్‌సైట్, అప్లికేషన్ ద్వారా విధించబడే ఫెడరల్ రుసుము Dh115.
వ్యాపార కేంద్రాలు గరిష్టంగా Dh72 వసూలు చేస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com