ఎత్తైన భవనాలలో అగ్నిప్రమాదాలు.. డ్రోన్‌లతో మంటల అదుపు..!

- September 08, 2024 , by Maagulf
ఎత్తైన భవనాలలో అగ్నిప్రమాదాలు.. డ్రోన్‌లతో మంటల అదుపు..!

యూఏఈ: షార్జా సివిల్ డిఫెన్స్ వచ్చే ఏడాది నుండి ఎమిరేట్‌లోని ఎత్తైన భవనాలలో సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనుంది.  కొత్త టెక్నాలజీని 2025 మొదటి త్రైమాసికంలో అమల్లోకి తేనుంది. దీని ద్వారా ఎత్తైన భవనాలలో జరిగే ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు యూఏఈలో ఉన్న సివిల్ డిఫెన్స్..కంపెనీ డ్రోన్ ఫస్ట్ బిల్డింగ్ సర్వీసెస్‌కు చెందిన సాంకేతిక బృందంతో అథారిటీ డ్రోన్‌ను పరీక్షించింది.  షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సమీ అల్ నఖ్బీ మాట్లాడుతూ.. తాము డ్రోన్‌ను పరీక్షించామని ఇది కేవలం 18 సెకన్లలో 40 అంతస్తులకు సమానమైన 150 మీటర్ల ఎత్తుకు చేరుకున్న పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిందన్నారు.  ఈ ఎత్తులో 5,000 లీటర్ల సామర్థ్యం కలిగిన అంతర్గత ట్యాంక్ నుండి 15 మీటర్ల వరకు నీటిని పిచికారీ చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించారని, ఇది గ్రౌండ్ ట్యాంక్‌కు అనుసంధానించబడిన నీటి గొట్టం ద్వారా రీఫిల్ చేయబడుతుందని వివరించారు. డ్రోన్‌లో థర్మల్ కెమెరా అమర్చబడి ఉంటుందని, ఇది ప్రమాద తీవ్రతను గుర్తించడంలో సహాయపడుతుందని, దీంతో మంటలను త్వరగా నియంత్రించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయని బ్రిగేడియర్ అల్ నక్బీ తెలిపారు. 27కిలోల బరువున్న ఈ డ్రోన్‌ బ్యాటరీ లేదా విద్యుత్‌తో పనిచేస్తంది. 12 గంటలపాటు నిరంతరాయంగా పనిచేయగలదని, రాత్రిపూట లైట్లు, హీట్ సెన్సార్‌లు, పారాచూట్‌లు పనిచేయక ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు వీలుగా ప్యారాచూట్‌ వ్యవస్థను ఇందులో అమర్చినట్లు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com