యూఏఈలో VPN వినియోగంపై నిషేధం ఉందా?

- September 08, 2024 , by Maagulf
యూఏఈలో VPN వినియోగంపై నిషేధం ఉందా?

యూఏఈ: యూఏఈలో VPNలను (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు) ఉపయోగించడం గురించి నియమాలు ఉన్నాయా? అవి చట్టబద్ధమైనవేనా? యూఏఈలో టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) మార్గదర్శకాల ప్రకారం.. VPNలను ఉపయోగించడం చట్టవిరుద్ధం కాదు. TDRA జూలై 31, 2016న VPN సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని నిరోధించే నిబంధనలు లేవని తెలిపింది. కాగా, కంపెనీలు, సంస్థలు, బ్యాంకులు ఇంటర్నెట్ ద్వారా తమ అంతర్గత నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, అది దుర్వినియోగం చేస్తే దానికి బాధ్యత వారే వహించాల్సి ఉంటుంది.  ఏది ఏమైనప్పటికీ, ఒకరి నిజమైన IP చిరునామాను దాచిపెట్టడం వంటి సాంకేతికతలను ఉపయోగించి నేరం చేయడానికి సమాచార నెట్‌వర్క్‌ను తప్పించుకోవడం వంటి చర్యలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం లేదా గుర్తించకుండా ఉండటం వంటివి తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి.దోషులుగా తేలిన వారికి జైలు శిక్ష/జరిమానా విధిస్తారు. సైబర్‌క్రైమ్‌లను ఎదుర్కోవడానికి సంబంధించిన 2021 చట్టం నెం. 34లోని ఆర్టికల్ 10 ప్రకారం.. జరిమానా  Dh2,000,000 వరకు ఉంటుంది.  

2017 ఇంటర్నెట్ యాక్సెస్ మేనేజ్‌మెంట్‌పై TDRA రెగ్యులేటరీ పాలసీలోని క్లాజ్ 1.9 'నిషేధించబడిన కంటెంట్ కేటగిరీలు' అనే పదాన్ని చేర్చింది. VPNలను పూర్తిగా నిషేధించనప్పటికీ బ్లాక్ చేయబడిన లేదా నిషేధించబడిన కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి లేదా బైపాస్ చేయడానికి వాటిని ఉపయోగించరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని టెక్నాలజీ రంగ నిపుణులు చెబుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com