ఒమన్‌కు పోటెత్తిన విజిటర్స్..7 నెలల్లో 2.3 మిలియన్ల మంది రాక..!
- September 09, 2024
మస్కట్: 2024 మొదటి ఏడు నెలల్లో 2.3 మిలియన్ల మంది విజిటర్స్ ను సుల్తానేట్ ఆఫ్ ఒమన్ స్వాగతం పలికింది. 2023లో ఇదే కాలంలో దేశాన్ని సందర్శించిన 2.2 మిలియన్ల మందితో పోలిస్తే ఇది 2.4 శాతం అధికం కావడం గమనార్హం. సందర్శకులలో మొదటి ఐదు స్థానాల్లో ఎమిరాటీలు (714,636), భారతీయులు (367,166), యెమెన్లు (139,354), జర్మన్లు (79,439) ఉన్నారు. అదే సమయంలో 4.7 మిలియన్ల మంది సందర్శకులు దేశం నుంచి వెళ్లారని నివేదికలు తెలిపాయి. ఇందులో 3,353,777 మంది ఒమానీలు, 506,121 మంది భారతీయులు, 302,351 మంది పాకిస్థానీలు, 171,799 బంగ్లాదేశీయులు, 131,575 మంది యెమెన్లు ఉన్నారు.
జూలైలో అంతర్జాతీయ విమానాల్లో దేశానికి చేరుకున్న మొదటి ఆరు స్థానాల్లో 105,581 మంది భారతీయులు, 104,050 మంది ఒమానీలు, 29,531 పాకిస్థానీయులు, 18,489 బంగ్లాదేశీయులు, 13,623 ఈజిప్షియన్లు, 11,633 ఎమిరాటీలు ఉన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ (3 నుండి 5 నక్షత్రాలు) విషయానికొస్తే.. మస్కట్‌లో 40.2 శాతం, ధోఫర్ 46.5 శాతం, నార్త్ అల్ బతినా 49 శాతం, సౌత్ అల్ షర్కియా 35.1 శాతం, అల్ ధఖిలియా 31.3 శాతంగా నమోదయింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …