షార్జాలో విషాదం.. స్కూల్ పైకప్పు కూలి ఇద్దరు మృతి..!
- September 09, 2024
యూఏఈ: షార్జాలోని కల్బా సిటీలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అలీ అల్-ఖమౌడీ మాట్లాడుతూ.. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించామని, చనిపోయిన వ్యక్తులు అరబ్, ఆసియా జాతీయులని పేర్కొన్నారు. షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ, కల్బా కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్, క్రైమ్ సీన్ టీమ్, నేషనల్ అంబులెన్స్, కల్బా సిటీ మున్సిపాలిటీతో సహా అన్ని ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయని పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు షార్జా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







