యూఏఈలో ఐఫోన్ 16 మోడల్స్ ధరలు ఔట్..సేల్స్ ఎప్పటినుండంటే?
- September 10, 2024
యూఏఈ: కాలిఫోర్నియాలోని కుపెర్టినో పార్క్‌లో ఆపిల్ గ్లోటైమ్ 2024 ఈవెంట్ లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఏఐ-బూస్ట్ ఐఫోన్ 16ని విడుదల చేశారు. సిరి పర్సనల్ అసిస్టెంట్‌లో మెరుగైన అప్డేట్ లను అందిస్తున్నారు. వచ్చే నెలలో మార్కెట్ లో లభ్యమవుతుందని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ అన్నారు. ఐఫోన్ 16లో 26mm ఫోకల్ లెంగ్త్‌తో 48MP ప్రధాన కెమెరా, ఆటోఫోకస్‌తో కూడిన కొత్త 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇది డాల్బీ విజన్‌లో 4K60 వీడియోకు సపోర్ట్ ఇస్తుంది. యూఏఈలో ఐఫోన్ ధరలను ప్రకటించారు. యూఏఈలో ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లను ఆవిష్కరించారు. ఐఫోన్ 16 ధర Dh3,399 , 16 Plus దాని బేస్ మోడల్ ధర Dh3,799 లకు లభించనున్నాయి. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ కూడా ఆవిష్కరించారు. వీటిలో వరుసగా 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లేలు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో A18 ప్రో చిప్‌తో అధిక పనితీరు సామర్థ్యాన్ని అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రో ఇప్పుడు 5x టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 16 Pro 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 16 Pro Dh4,299 వద్ద ప్రారంభమవుతుండగా.. అయితే ఐఫోన్ 16 Pro Max యూఏఈలో ధర Dh5,099కు లభ్యం కానుంది. రెండు మోడళ్ల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ 20 నుండి ఆపీల్ వెబ్సైట్లో అధికారికంగా లభిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







