టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..
- September 10, 2024
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్‌లో గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ కోలుకున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో చోటే లక్ష్యంగా బుచ్చిబాబు టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు సూర్యకుమార్ యాదవ్.ఇందులో తన ఫామ్‌ను నిరూపించుకుని బంగ్లాతో సిరీస్‌కు ఎంపిక కావాలని అనుకున్నాడు.అయితే.. తొలి మ్యాచ్‌లోనే అతడి కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో అతడి ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. బుచ్చిబాబు టోర్నీతో పాటు దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో సూర్య ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఇటీవల అతడిని బీసీసీఐ వర్గాలు కలిశాయి. అతడు గాయం నుంచి కోలుకున్నాడని సమాచారం. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌సీఏ వర్గాలు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది.
అయితే.. అంతకంటే ముందే సూర్య సెప్టెంబర్ 12 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచుల్లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా-సి జట్టు తరుపున అతడు ఆడనున్నాడు. సూర్య గాయపడినప్పటికి అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేయలేదు. సూర్యకుమార్ గాయం నుంచి కోలుకోవడం అభిమానులకు శుభవార్తే. అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో బరిలోకి దిగనుంది.
టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో బీసీసీఐ టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. అతడి నాయకత్వంలో శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడింది. 3-0 తేడాతో లంకను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?