12 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఎంబసీ ప్రారంభించిన సౌదీ..!

- September 11, 2024 , by Maagulf
12 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఎంబసీ ప్రారంభించిన సౌదీ..!

డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్‌లో 12 సంవత్సరాల క్రితం సిరియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి మూసివేసిన తన రాయబార కార్యాలయాన్ని సౌదీ అరేబియా తిరిగి ప్రారంభించింది. సిరియాలోని సౌదీ ఛార్జ్ డి అఫైర్స్ యాక్టింగ్ అబ్దుల్లా అల్-హరీస్ అధికారికంగా ఎంబసీని ప్రారంభించారు.  రెండు దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా అల్-హరీస్ అభివర్ణించారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది కీలక ముందడుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిరియా విదేశాంగ వ్యవహారాల మంత్రి అయ్యమన్ రాద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా.. ఈ చర్య ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు.  ఈ ఏడాది మేలో సిరియాలో సౌదీ రాయబారిగా ఫైసల్ బిన్ సౌద్ అల్-ముజ్‌ఫెల్‌ను నియమించారు.  సిరియా కూడా సౌదీ అరేబియాకు కొత్త రాయబారిగా డాక్టర్ ముహమ్మద్ సౌసాన్‌ను నియమించింది. ఈ ఏడాది జనవరిలో డాక్టర్ సౌసాన్ రియాద్‌లో బాధ్యతలు స్వీకరించారు.  అక్టోబర్ 2023లో తమ దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించాలనే నిర్ణయాన్ని సౌదీ అరేబియా, సిరియా ప్రకటించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com