‘మా నాన్న సూపర్ హీరో’.! సుధీర్ బాబు సర్‌ప్రైజ్.!
- September 14, 2024
విలక్షణ నటుడిగా సుధీర్‌బాబుకి మంచి పేరుంది. రీసెంట్‌గా ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమా డిఫరెంట్ యాక్షన్ థ్రి్ల్లర్ కేటగిరీలో మంచి మార్కులేయించుకుంది.
ధియేటర్లో అంతంత మాత్రంగానే ఆడినా.. ఓటీటీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో కొత్త కథతో రాబోతున్నాడు సుధీర్ బాబు.
‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా టీజర్ లేటెస్ట్‌గా రిలీజ్ అయ్యింది. తండ్రి సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని టీజర్ బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికే తండ్రీ కొడుకుల నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయ్.
అందులో కొన్ని ఓ మాదిరి అనిపించుకున్నాయ్. కొన్ని హిట్స్.. మరికొన్ని సూపర్ హిట్స్‌గా నిలిచాయ్. మరి, తన సినిమాతో సుధీర్ బాబు ఏం కొత్త కథను చెప్పబోతున్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
బాధ్యత లేకుండా ఊరి నిండా అప్పులు చేసే తండ్రి.. అవి తీర్చుకుంటూ వెళ్లే కొడుకు, అయినా కానీ, తండ్రి మనసు ఏమాత్రం బాధపడకుండా.. తండ్రే ప్రాణంగా బతికే ఓ కొడుకు కథ.. ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ కథలోని మలుపులేంటో తన తండ్రి సెంటిమెంట్‌తో సుధీర్ బాబు ఆడియన్స్ మనసు ఎలా గెలుచుకుంటాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







