శరీరంలో వాపులు తగ్గేందుకు గోంగూర పత్యం.!
- September 14, 2024
గోంగూర అంటే తెలుగు వారికి :ఎంతో అభిమానం. ఆ అభిమానానికి కారణం అందులోని ఔషధ గుణాలే. గోంగూరలో కావల్సినంత ఫైబర్, ఐరన్ వుంటుంది. అందుకే ఆరోగ్యానికి చాలా మంచిది.
ముఖ్యంగా శరీరంలో ఎక్కడైనా వాపులుంటే గోంగూర తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏ ఇతర కారణాల వల్లనైనా శరీరంలో నీరు చేరినట్లయితే గోంగూర తింటే తగ్గిపోతుంది.
విరేచనాలు (లూజ్ మోషన్స్) అవుతున్నా.. కొండ గోంగూరను నీటితో కలిపి తాగితే విరేచనాలు కంట్రోల్‌లోకి వస్తాయ్ అలాగే డైలీ డైట్‌లో గోంగూరను చేర్చుకుంటే మలబద్ధకం సమస్యలు నియంత్రణలో వుంటాయ్. కాల్షియం పాళ్లు కూడా గోంగూరలో అధికంగా వుంటాయ్. అందుకే ఎముకలు ధృడంగా వుండాలన్నా గోంగూర తింటే మంచిదని చెబుతున్నారు.
అయితే, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వాళ్లు గోంగూరకు కాస్త దూరంగా వుండాలని సూచిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు గట్రా వున్నవాళ్లు గోంగూరను లైట్‌గా తీసుకోవాలి.
గోంగూరలో ఐరన్ ఎక్కువగా వుండడం వల్ల రాత్రి పూట కాస్త తక్కువగా తింటే మంచిది. లేదంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!